మ‌న దేశంలో 30 క‌రోనా డేంజ‌ర్ సిటీస్ ఇవే

మ‌న దేశంలో 30 క‌రోనా డేంజ‌ర్ సిటీస్ ఇవే

0
30

మ‌న దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి కాని ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు, దాదాపు దేశంలో ఇప్పుడు 90 వేల కేసులు న‌మోదు అయ్యాయి, ఇక క‌రోనా గురించి దేశంలో లాక్ డౌన్ అమ‌లు చేసి దాదాపు 52 రోజులు అవుతోంది. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. రోజు ఇప్పుడు ఏకంగా 3000 కేసులు న‌మోదు అవుతున్నాయి.

అయితే లాక్ డౌన్ 4.0 రేప‌టి నుంచి అమ‌లు అవుతుంది, మ‌రీ ముఖ్యంగా కొన్ని న‌గ‌రాల్లో కేసులు ఎక్కువ అవుతున్నాయి.. అందు‌కే ఆ ప్రాంతాల్లో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి అని కేంద్రం చెబుతోంది.దేశంలోని 80 శాతం కరోనా కేసులున్న 30 మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలు తెలిపారు. ఇక్క‌డ పూర్తిగా ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తారు

అవి గ్రేటర్ హైదరాబాద్, బృహన్ ముంబై, గ్రేటర్ చెన్నై, అహ్మదాబాద్, థానే, ఢిల్లీ, ఇండోర్, పుణె, కోల్‌కతా, జైపూర్, నాశిక్, జోధపూర్, ఆగ్రా, తిరువళ్లూర్, ఔరంగాబాద్, కడలూరు, సూరత్, చెంగల్పట్టు, హౌరా, అరియాలూర్, కుందూర్, భోపాల్, అమృత్‌సర్, మీరట్, విలుప్పురం, వడోదర, ఉదయ్‌పూర్, పాల్ఘర్, బెహ్రాంపూర్, సోలాపూర్, మీరట్. ఇక్క‌డ కేసులు పెరుగుతున్నందున జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇక్క‌డ ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయం అని తెలిపింది కేంద్రం.