మ‌న దేశంలో లాక్ డౌన్ విధానం ఇదే – కేంద్రం టార్గెట్

మ‌న దేశంలో లాక్ డౌన్ విధానం ఇదే - కేంద్రం టార్గెట్

0
123

దేశంలో వైర‌స్ విస్త‌రిస్తున్న‌ నేప‌థ్యంలో మొద‌టిసారిగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మ‌న దేశంలో లాక్ డౌన్ విధించారు, మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశమంతా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు తొలి దశ లాక్ డౌన్ మ‌న దేశంలో అమ‌లు చేశారు, అయినా కేసులు సంఖ్య త‌గ్గ‌లేదు.

త‌ర్వాత మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ మే 17 వరకు మరోసారి లాక్ డౌన్ పొడిగించారు.. తాజాగా మళ్లీ మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..అయితే ఈసారి కూడా ప‌లు ఆంక్ష‌లు నియ‌మాలు పెట్టారు, కాని కాస్త భిన్నంగా గ‌తంలో కంటే కొన్ని స‌డ‌లింపులు ఇచ్చారు.

దీంతో దాదాపు ఇది పూర్తి అయితే మ‌న‌దేశంలో 65 రోజులు లాక్ డౌన్ అమ‌లు చేసిన‌ట్లే, ఇక ఈ 15 రోజులు చాలా కీల‌కం కానుంది, ఇక వ‌ర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబ‌ట్టి జూన్ నెల మొద‌టి వారంలో ఈ కేసుల సంఖ్య త‌గ్గాలి అని భావిస్తున్నారు.