మే 31 వ‌ర‌కూ తెర‌చుకునేవి ఇవే మూసేవి ఇవే

మే 31 వ‌ర‌కూ తెర‌చుకునేవి ఇవే మూసేవి ఇవే

0
32

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వ‌ర‌కూ పొడిగించింది కేంద్రం, ఇక ఇప్ప‌టికే ప‌లు మార్గ‌ద‌ర్శకా‌లు కూడా కేంద్రం ప్ర‌కటించింది, ఇప్పుడు లాక్ డౌన్ వేళ పూర్తిగా స‌డ‌లింపులు ఇవ్వ‌కుండా కొన్నింటికి మాత్ర‌మే ఇచ్చారు, ఆర్ధిక వ్య‌వ‌స్ధ అత్యంత దారుణంగా దెబ్బ‌తింది, అందుకే స‌డ‌లింపులు ఇస్తోంది కేంద్రం, తాజాగా ఈ 31 వ‌ర‌కూ వేటికి అనుమ‌తి అనేది చూద్దాం.

క్లోజ్ చేసేవి
దేశంలో రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుంది, ఇక కంటైన్మెంట్లు రెడ్ జోన్ల‌లో బ‌స్సులు తిర‌గ‌డానికి లేదు, ఆర్టీసీ బ‌స్సులు అన్నీ గ్రీన్ ఆరెంజ్ జోన్ల‌లో న‌డుపుకోవ‌చ్చు, అంతరాష్ట్ర స‌ర్వీసులు కూడా ప‌ర‌స్ప‌రం రాష్ట్రాలు చ‌ర్చించుకుని అంగీకారంతో తిప్పుకోవ‌చ్చు.
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. మెట్రో రైల్స్ కి అనుమ‌తి లేదు..
పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు..సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు. మ‌తాల మీటింగులు రాజ‌కీయ మీటింగులు ప‌బ్లిక్ గాద‌రింగ్స్ చేయ‌కూడ‌దు.

ఓపెన్ చేసేవి
దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఇచ్చారు, ఆన్ లైన్ ఫుడ్ డెలివ‌రీ చేసుకోవ‌చ్చు, వివాహాల‌కు 50 మందికి అనుమ‌తి ఇచ్చారు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న క్యాంటిన్లు నడిపేందుకు అనుమతులు ఇచ్చారు, సెలూన్స్ ఓపెన్ చేయ‌డంపై రాష్ట్రాలు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.