తెలంగాణలో కేసీఆర్ సర్కారు కొన్ని సడలింపులు అయితే ఇచ్చింది, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ పూర్తిగా లాక్ డౌన్ అమలు అయింది, కాని తాజాగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో కొన్ని సడలింపులు ఇచ్చారు, బస్సులు నడుస్తున్నాయి, ఇక క్యాబ్ లు, ఆటోలు ట్యాక్సీలు నడుపుకునేందుకు అవకాశం ఇచ్చారు.
అయితే, మే 31 వరకు కొన్ని నిబంధనలు, సేఫ్టీ నియమాలు ఉంటాయని అన్నారు. ఇక ప్రయాణాల నిబంధనలపై తాజాగా క్లారిటీ అయితే ఇచ్చారు, ఈ వైరస్ లాక్ డౌన్ వేళ బైక్ పై ఒక్కరికి మాత్రమే పర్మిషన్ ఉంది, కాని తాజాగా బైక్ పై ఇద్దరు వెళ్లవచ్చు అని తెలిపారు ఉత్తర్వుల్లో.
తెలంగాణ ప్రభుత్వం ఆ పాత నిబంధనను తొలగించింది. బైక్ రైడర్‌తో పాటు.. వెనకాల కూడా కూర్చొని
వెళ్లవచ్చు, కారులో అయితే.. డ్రైవర్ కాకుండా ముగ్గురు, ఆటోలో డ్రైవర్ కాకుండా ఇద్దరు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ఇక కారు క్యాబ్ ఆటో అన్నీ కూడా పూర్తి శానిటైజేషన్ చేయాలి, భౌతిక దూరం పాటించాలి, శానిటైజర్లు ప్యాసింజర్లకు అందించాలి.