తెలంగాణలో 10th క్లాస్ విద్యార్దుల‌కి గుడ్ న్యూస్ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే

తెలంగాణలో 10th క్లాస్ విద్యార్దుల‌కి గుడ్ న్యూస్ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే

0
56

ఈ వైర‌స్ కష్ట‌కాలంలో దేశం అంతా లాక్ డౌన్ లో ఉంది, ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి, ముఖ్యంగా దేశంలో అన్నీ స్టేట్స్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి, తాజాగా ఏపీలో జూలై 10 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.. జూలై 15 వ‌ర‌కూ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి, ఇక తెలంగాణ‌లో కూడా ప‌ది ప‌రీక్ష‌ల‌పై క్లారిటీ వ‌చ్చింది.

తెలంగాణ‌లో జ‌ర‌గాల్సిన 10th క్లాస్ పరీక్షలకు తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. జూన్ 3న పరీక్షల నిర్వహణపై సమీక్షించాలని..దీనికి సంబంధించి జూన్ 4న పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని హైకోర్ట్ ఆదేశించింది, అంతేకాదు ప‌రీక్ష‌కి ప‌రిక్ష‌కి మ‌ధ్య రెండు రోజులు గ్యాప్ ఉండాల‌ని తెలిపింది.

ఇక వైర‌స్ భ‌యం నేప‌థ్యంలో ప‌రీక్ష సెంట‌ర్లు పెంచాలి అని తెలిపింది, ఇక భౌతిక దూరం పాటించాలి, అలాగే మాస్క్ ధ‌రించి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది, ఇక శానిటైజ‌ర్లు మాస్క్ లు అందుబాటులో ఉంచాలి, పూర్తిగా త‌ర‌గ‌తి గ‌తి శుభ్రంగా ఉండాలి అని తెలిపింది, విద్యార్దుల‌కి ప్ర‌త్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి అని తెలిపింది.