తెలంగాణ‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ‌లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

0
90

తెలంగాణ‌లో ఎంసెట్ కు సంబంధించి ప్ర‌వేశ ప‌రీక్ష‌లు ఇత‌ర ప‌రీక్ష‌ల‌కు సంబంధించి షెడ్యూల్ ని విడుద‌ల చేసింది తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి….ఎంసెట్ ,ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల పై చర్చ జరిపి చివరికి డేట్లు ప్రకటించారు. ఇప్ప‌టికే వైర‌స్ వ్యాప్తి వ‌ల్ల ఈ ప‌రీక్ష‌ల‌పై ఎలాంటి డెసిష‌న్ తీసుకోలేదు.తాజాగా తీసుకున్నారు.

ఇక కేంద్రం తాజాగా ప‌లు స‌డ‌లింపులు ఇచ్చింది, ఇక అక‌డ‌మిక్ ఇయ‌ర్ ఇబ్బంది కాబ‌ట్టి క‌చ్చితంగా వ‌చ్చే నెల నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి అని చూస్తున్నారు…తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ :

ఎంసెట్- జులై 6 నుంచి 9 వరకు
ఈసెట్ – జులై 4
లాసెట్- జులై 10
టీఎస్ పీజీఈసెట్- జులై 1 నుంచి 3 వరకు
టీఎస్ పాలిసెట్- జులై 1
ఐసెట్- జులై13
ఎడ్‌సెట్- జులై 15

ఇక విధ్యార్దులు వీటికి సంబంధించి అప్లై చేసేందుకు సిద్దం అవుతున్నారు.