టీడీపీ కంచుకోటలో వైసీపీలోకి భారీ వలసలు…

టీడీపీ కంచుకోటలో వైసీపీలోకి భారీ వలసలు...

0
92

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన కీలన నేతలు వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు తమ రాజకీయల దృష్ట్య ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే…

ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు వైసీపీ తీర్థం తీసుకున్నారు… పార్టీలోకి చేరేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై తాము వైసీపీ తీర్థం తీసుకున్నామని అన్నారు…

పార్టీ కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు… కాగా ఎప్పటినుంచి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కంచుకోటగా పిలువబడుతున్న సంగతి తెలిసిందే.. అయితే 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి సునామితో జిల్లా వ్యాప్తంగా వైసీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని తమ కంచుకోటగా మార్చుకుంది…