తెలంగాణ మంత్రి – టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైనమిక్ లీడర్ అనే విషయం తెలిసిందే, ఐటీశాఖ మున్సిపల్ శాఖను తెలంగాణలో చూస్తున్నారు మంత్రి కేటీఆర్ . అనేక అవార్డులు కూడా ఆయన సారథ్యంలో సాధించాయి ఆయన లీడ్ చేస్తున్నశాఖలు, ఇక క్రమశిక్షణ పద్దతికి కేరాఫ్ అడ్రస్ కేటీఆర్, నిత్యం సోషల్ మీడియాలో కూడా ఆయన ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే.
అలాంటి మంత్రి కేటీఆర్ మరో అరుదైన గౌరవం పొందనున్నారు..శ్రీలంకలో జరగబోయే అంతర్జాతీయ సదస్సు నుంచి ఆహ్వానం అందింది..ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీలంక విభాగం ఆధ్వర్యంలో మే 30న జరిగే సదస్సులో కొవిడ్ -19 దక్షిణాసియా భవిష్యత్తు పునర్ రూపకల్పనఅనే అంశంపై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు మంత్రి కేటీఆర్ను కోరారు…
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ బాడీ… వందదేశాల్లో 45 లక్షలమంది సభ్యులు ఈ సంస్థకు ఉన్నారు. ఇక్కడ అనేక అంశాలపై ప్రసంగించనున్నారు, ఈ వైరస్ మహమ్మారిపై ఎలా పోరాడాలి, భవిష్యత్ సంక్షోభం ఎలా ఎదుర్కోవాలి అనే, రాజకీయ ఆర్ధిక అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు.