చైనాను దాటేసింది భారత్ మరో రికార్డ్

చైనాను దాటేసింది భారత్ మరో రికార్డ్

0
38

ఈ వైరస్ మహమ్మారి చైనాలో పుట్టింది ..ఏకంగా 210 దేశాలకు పాకేసింది 50 లక్షల పాజిటీవ్ కేసులు చేరుకున్నాయి, మరణాల సంఖ్య తీవ్రంగా ఉంది, అయితే ఇది అమెరికాని అతలాకుతలం చేసింది, ఇప్పుడు భారత్ పై కూడా ఇది పంజా విసురుతోంది, రెండు నెలలు లాక్ డౌన్ పెట్టినా దేశంలో కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కేసులు నమోదవగా.. 175మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799కి చేరుకోగా.. మరణాల సంఖ్య 4706కు చేరింది. ఇక చైనా వెల్లడించిన వివరాల బట్టీ అక్కడ మరణాల సంఖ్యతో పోలీస్తే మన దేశంలో మరణాలు పెరిగాయి అంటున్నారు నిపుణులు.

చైనాలో ఇప్పటివరకు 4634 కొవిడ్ మరణాలు సంభవించగా భారత్లో ఈ సంఖ్య 4706కు చేరుకుంది.
అంతేకాకుండా కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. లక్షా 82వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉంది. మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశంలో.