శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు రేట్స్

శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు రేట్స్

0
87

బంగారం ధర గడిచిన మూడు రోజులుగా తగ్గుతూనే వస్తోంది, దాదాపు 50 వేల మార్క్ చేరుకుంటుంది అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు బంగారం ధర తగ్గుతోంది, బంగారం కొనుగోలు చేయాలి అని అనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధర తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర తగ్గుతోంది. అందుకే గోల్డ్ రేట్ తగ్గింది అంటున్నారు వ్యాపారులు.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1130 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,310 దగ్గర ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1060 పడిపోయింది. దీంతో ధర రూ.48,090కు దిగొచ్చింది. బంగారం ధర మరింత తగ్గుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు, షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు గోల్డ్ ధర తగ్గుతోంది.

కేజీ వెండి ధర గత రెండు రోజుల్లో రూ.200 దిగొచ్చింది. అయితే ఈరోజు మాత్రం రూ.600 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.48,500కు చేరింది. బంగారం ఈ రెండు వారాల్లో తగ్గినా మళ్లీ ధర పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు.