దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే లాక్ డౌన్ వేళ కేంద్రం కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది, మరీ ముఖ్యంగా ప్రజా రవాణా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, కొన్ని స్పెషల్ ట్రైన్స్ తిరుగుతున్నాయి, అయితే ఈ సమయంలో సిటీ బస్సులు మాత్రం ఎక్కడా తిరగడం లేదు.
ఈ కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలో కూడా ఆర్టీసీ సిటీ బస్సులు నడపలేదు, తాజాగా దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 8వ తేదీ నుంచి నగరంలో సిటీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు తెలిపింది. దాదాపు 70 రోజులుగా సిటీ బస్సులు నడవలేదు, ఇప్పుడు సడలింపుల్లో భాగంగా సిటీ బస్సు సర్వీసులు నడపాలి అని నిర్ణయం తీసుకున్నారు.
ఇక సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. వీరు బస్సులు లేక ప్రైవేట్ క్యాబ్ సర్వీసులు ఎక్కువగా వాడుతూ వచ్చారు, ఈ చార్జీలతో తమ జేబుకు చిల్లు పడుతోంది అని బాధపడ్డారు జనం, ఇప్పుడు బస్సులు తిరిగితే ఈ సమస్య ఇక ఉండదు, ప్రయాణికులకు నగదు భారీగా ఖర్చు అవ్వదు.