బ్రేకింగ్ భక్తులు నడిచివెళ్లాల్సిందే నో వెహికల్స్ – యాదగిరిగుట్ట లో కొత్త రూల్

బ్రేకింగ్ భక్తులు నడిచివెళ్లాల్సిందే నో వెహికల్స్ - యాదగిరిగుట్ట లో కొత్త రూల్

0
38

మార్చి చివరి వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులకి ప్రవేశం లేదు.. భక్తులకి దర్శనం లేదు.. కేవలం స్వామికి పండితులు పూజారులు నిత్య కైంకర్యాలు చేస్తున్నారు, అయితే ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి, అయితే తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరి గుట్ట యాదాద్రి లో కూడా దేవాలయంలో భక్తులకి 8 వ తేది నుంచి దర్శనానికి అనుమతి ఉంది.

తిరుమలలో పాటుగా తెలంగాణలో యాదాద్రికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇందులో దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది, దర్శనం క్యూ లైన్లలో పూర్తిగా మార్కింగ్ చేశారు, తక్కువ సంఖ్యలోనే భక్తులకి అనుమతి ఇస్తారు.

జూన్ 8 వ తేదీ నుంచి భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే నేరుగా కొండపైకి వాహనాల ద్వారా వెళ్లడానికి అనుమతి లేదు..గుట్ట మీద ఉన్న ఆలయంలోకి వెళ్ళాలి అంటే భక్తులు కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. పైకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు. ఇక పదిసంవత్సరాల లోపు చిన్నారులు 65 ఏళ్ళు దాటిన వారికి ఆలయంలోకి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్క్ ధరించాలి.