గ్యాస్ సిలిండర్ గురించి ఈ 10 విషయాలు తెలుసుకొండి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది

గ్యాస్ సిలిండర్ గురించి ఈ 10 విషయాలు తెలుసుకొండి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది

0
75

ఇంటిలో ప్రతీ ఒక్కరికి గ్యాస్ సిలిండర్ ఉంటోంది, అయితే ఈ సమయంలో మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం పొరపాటున అది పేలింది అంటే దారుణమైన పరిస్దితి వస్తుంది ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుంది.. దీనికి సంబంధించి పలు జాగ్రత్తలు పాటించాలి.

1.. మీరు ఇంటి నుంచి బయటకు వెళితే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి
2.. గ్యాస్ ఆన్ చేసి అలా వదిలెయ్యవద్దు.
3.. వెలుతురు ఉండేలా రూమ్ లో చూసుకోండి, మరీ గ్యాస్ ఉన్న చోట ఇరుకుగా ఉండకూడదు
4. మండే వస్తువులు పెట్రోల్ వంటివి గ్యాస్ ఉన్న రూమ్ లో ఉంచవద్దు
5..గ్యాస్ సిలిండర్ పేలితే దానికి డీలర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.
6.. మీరు కచ్చితంగా డీలర్లు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో పూర్తిగా చెక్ చేసుకోవాలి.
7. ఒక వేళ ప్రమాదంలో లోపబూయిష్టంగా ఉన్న గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవిస్తే, కన్సూమర్లక రూ.50 లక్షల వరకూ ఇన్సూరెన్స్ లభిస్తుంది.
8.. ఇలా ప్రమాదం జరిగిన వెంటనే మీరు స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి
9.. ఈ గ్యాస్ ఇన్సూరెన్స్ కు వినియోగదారులు ఎలాంటి ప్రిమీయం చెల్లించక్కర్లేదు
10..ఎఫ్ఐఆర్, మెడికల్ బిల్స్, డెత్ సర్టిఫికెట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వంటి డాక్యుమెంట్లు మీరు వారికి ఇవ్వాల్సి ఉంటుంది.