ఈనెల11నుంచి భక్తులకి తిరుమల స్వామి వారి దర్శనం కొత్త రూల్స్ ఇవే

ఈనెల11నుంచి భక్తులకి తిరుమల స్వామి వారి దర్శనం కొత్త రూల్స్ ఇవే

0
34

ఈనెల 8 నుంచి తిరుమల స్వామి వారి దర్శనం భక్తులకి కల్పించనున్నారు…ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.ఇక 8, 9వ తేదీన ఆలయం తెరిచినా.. స్థానికులు, ఉద్యోగులకే అనుమతి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతి ఉంటుంది.

11వ తేదీ నుంచి గంటకు 500 మందికి దర్శనాలు కల్పిస్తారు, 300 రూపాయల ఆన్ లైన్ దర్శనం టికెట్స్ విడుదల చేస్తారు, ఇక ఆన్ లైన్ లో దర్శనం టికెట్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనం ఉంటుంది, చిన్న పిల్లలు వయోవృద్దులకి అనుమతి లేదు భక్తులందరికీ అలిపిరి గేటు దగ్గర కోవిడ్ పరీక్షలు చేసాకే కొండపైకి అనుమతిస్తారు, క్యూ లైన్ కు వెళ్లేముందు స్క్రీనింగ్ చేస్తారు.

భక్తుల లగేజ్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసి పంపుతారు, కొండపై వసతి గృహాలు దర్శనానికి వచ్చే భక్తులకి కేవలం ఇద్దరికి మాత్రమే ఓ రూమ్ ఇస్తారు, అది కూడా ఒకరోజుకి మాత్రమే రూమ్ ఇస్తారు, రూమ్ ఖాళీ చేశాక శానిటైజ్ చేశాక వేరే వారికి ఇస్తారు..కొండపై పుష్కరిణిలో స్నానాలకి అనుమతి లేదు. ఉపాలయాల దర్శనం ఉండదు.