సీఎం జగన్ దగ్గరకు సినిమా పెద్దలు మరి బాలయ్య ఏమన్నారు?

సీఎం జగన్ దగ్గరకు సినిమా పెద్దలు మరి బాలయ్య ఏమన్నారు?

0
81

ఇప్పటికే సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు అందరూ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.. సినిమా షూటింగుల గురించి చర్చించారు.. త్వరలో దీనిపై ప్రకటన అయితే రానుంది, అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కూడా నేరుగా కలవనున్నారు సినిమా పెద్దలు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఈ నెల 9న సినీ పెద్దలు సమావేశం కానున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్తో భేటీ కానున్నామని అన్నారు, ఇక మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలయ్య బాబుతో సహ చాలా మందిని పిలిచాము అని అన్నారు.

అయితే జూన్ 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆయన ఈ సమావేశానికి రావటం లేదన్నారు. ఇటీవల బాలయ్య వ్యాఖ్యలతో పెను వివాదం అయింది, అందుకే ఈసారి సినిమా పరిశ్రమలో చాలా మందిని సీఎం భేటికి పిలిచారు అని అంటున్నారు. బాలయ్య ఈ భేటికి దూరంగా ఉండనున్నారట.