ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును దెబ్బ కొట్టేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో టీడీపీ కోలుకోలేని దెబ్బకొట్టాలని ప్లాన్లు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నా… 14 సెగ్మెంట్లు ఉన్న ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవ్వరు గెలవలేదు…
ఇప్పుడు స్థానికి సంస్థల్లో కూడా సేమ్ సీన్ ను రిపీట్ చేయాలని చూస్తోంది సర్కార్… మరో వైపు టీడీపీ కూడా జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది.. కానీ ఆ పార్టీని కోలుకోకుండా చేయాలని చూస్తోంది వైసీపీ… ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పారు… వీరిద్దరు స్థానికి సంస్థల నాటికి వైసీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు…
ఇక వీరితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… ఇలా జిల్లా ద్వితియ శ్రేణి నాయకులును వైసీపీ టార్గెట్ చేస్తూ తమ పార్టీలో చేర్చుకునే దిశగా అడుగులు వేస్తోందట… మరి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న చంద్రబాబు తన సొంత జిల్లాలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఇంకెలాంటి ప్లాన్లు వేస్తారో చూడాడి…