హైదరాబాద్ లో ఇలా చేస్తే కేసులే సీరియస్ వార్నింగ్

హైదరాబాద్ లో ఇలా చేస్తే కేసులే సీరియస్ వార్నింగ్

0
97

ఈ లాక్ డౌన్ సమయం నుంచి చెబుతూనే ఉన్నారు ఎవరు బయటకు వచ్చినా మాస్క్ ధరించాలని… ఈ సమయంలో మాస్క్ ధరించకపోతే వారిపై కేసులు నమోదు చేయడమే కాదు, వారికి ఫైన్లు వేస్తున్నారు, ఇక దేశంలో చాలా చోట్ల ఇప్పటికే చలాన్లు ఫైన్లు విధించారు, ఇక హైదరాబాద్ లో కూడా ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి ఫైన్ వేస్తున్నారు.

కొందరు దీనిని తేలిగ్గా తీసుకుంటున్నారు. మాస్క్లు లేకుండానే రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే వ్యక్తిగత జాగ్రత్తలపై పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు.. ఇప్పుడు యాక్షన్లోకి దిగారు. మాస్క్ లేకుండా బయటకు వస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు.

ఇప్పటికే దీనిపై చాలా మందికి తెలిపారు, అయినా కొందరు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు..
కుత్బుల్లాపూర్లోనే గత రెండు వారాల్లో 272 మందిపై కేసులు నమోదు చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51-D ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టారు, ఇక మరింత సీరియస్ గా తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు