మ‌ళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ? మోదీ అమిత్ షా మంత్రులు చ‌ర్చ

మ‌ళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ ? మోదీ అమిత్ షా మంత్రులు చ‌ర్చ

0
102

ఇండియాలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది, దీంతో ఆస్ప‌త్రుల్లో బెడ్ లు కూడా లేని ప‌రిస్దితి, ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ స‌డ‌లింపులు మొత్తం తీసివేసి , పూర్తిగా మ‌ళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలి అని కోరుతున్నారు అంద‌రూ.

ముఖ్యంగా లాక్ డౌన్ కంటిన్యూ చేస్తేనే కేసులు ఉండ‌వు త‌గ్గుతాయి అని చాలా మంది చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, తన మంత్రివర్గ సహచరులతో నిన్న అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు హాజరయ్యారు.

ఇక వాట్ నెక్ట్స్ అనేదానిపైనే చ‌ర్చ జ‌రిగింది. మ‌రోసారి నెల రోజులు పూర్తి లాక్ డౌన్ పెడితే క‌చ్చితంగా కేసులు త‌గ్గుతాయి అని అధికారులు కూడా చెబుతున్నార‌ట‌.ఈ నెల 16, 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమై నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ట‌.