ఇతర రాష్ట్రాల బస్సు సర్వీసులపై ఆర్టీసీ కీలక నిర్ణయం

ఇతర రాష్ట్రాల బస్సు సర్వీసులపై ఆర్టీసీ కీలక నిర్ణయం

0
85

ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు ఎప్పటి నుంచి నడుపుతారు అని చాలా మంది ఎదురుచూస్తున్నారు, ఈ సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారు అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు ఈ బస్సు సర్వీసుల కోసం చూస్తున్నారు.

అయితే వచ్చేవారం దీనిపై కీలక ప్రకటన వస్తుంది అని అందరూ భావిస్తున్నారు.. ఇక
అంతర్రాష్ట బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్-కర్ణాటకకు బస్సు సర్వీసులను పునరుద్ధరించింది.

కర్ణాటక బెంగళూరుకి బస్సులు నడపాలి అని చూస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ.. ఇక ముందు కొన్ని బస్సులు మాత్రమే నడపాలి అని భావిస్తోంది.. ముందు 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి తర్వాత నాలుగు దశల్లో గతంలో ఎన్ని బస్సులైతే తిరిగేవో అన్ని బస్సులను తిప్పనుంది. నేటి నుంచి రిజర్వేషన్లు స్టార్ట్ చేయనున్నారు.ఇక భౌతిక దూరం మాస్క్ తప్పనిసరిగా వాడాలి.