సంతానం కోసం చూసే వారు ఈ పొర‌పాట్లు చేయ‌కండి

సంతానం కోసం చూసే వారు ఈ పొర‌పాట్లు చేయ‌కండి

0
97

చాలా మందికి వివాహం అయి ప‌ది సంవ‌త్స‌రాలు అయినా కొంద‌రికి పిల్ల‌లు క‌ల‌గ‌రు… దీంతో వారు ఎంతో కృంగిపోతారు, ముఖ్యంగా వారికి అనేక స‌మ‌స్య‌లు ఉండ‌టం వ‌ల్ల పిల్ల‌లు క‌ల‌గ‌క పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అవుతుంది, అయితే మ‌రీ ముఖ్యంగా పురుషుల్లో వీర్య క‌ణాల స‌మ‌స్య కూడా ప్ర‌ధాన‌మైన‌ది అని చెప్పాలి.

చాలా కార‌ణాలు స‌మ‌స్య‌ల వ‌ల్ల వీర్య‌క‌ణాల సంఖ్య త‌క్కువ ఉంటుంది, అయితే స్పెర్మ్ కౌంట్ బాగా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం అల‌వాట్లు మానాలి అనేది చూద్దాం.

బరువు ఎక్కువగా ఉంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకోసం పిల్ల‌లు కావాలి అని అనుకునే వారు క‌చ్చితంగా బరువు తగ్గాలి, నడవాలి, పరిగెత్తాలి. ఒంట్లో కొవ్వు తగ్గించుకోవాలి. రోజూ 55 నిమిషాల పాటు పని చేయాలి.

ఇక చాలా మందికి ప‌ని ఒత్తిడి నిద్ర‌లేమి ఉంటుంది ఈ స‌మ‌స్య లేకుండా చూసుకోవాలి..
ఒత్తిడి వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు.మద్యాన్ని, మత్తుపదార్థాలను అస్సలు వాడకూడదన్నారు. వేపుళ్లు కూడా తగ్గించుకోవాలి అని చెబుతున్నారు డాక్ట‌ర్లు, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి.