మన దేశంలో వ్యాపారం చేసుకుంటూ ఆ వచ్చిన నగదుతో మన దేశంపైనే దాడి చేయాలి అని చూస్తోంది చైనా, అందుకే చైనాని ఆర్ధికంగా దెబ్బ తీయాలి అని చూస్తున్నారు మన వారు, అయితే చైనాకి సంబంధించిన ప్రొడక్ట్స యాప్స్ డిజిటల్ సర్వీసులు ఇలా అన్నీంటిని బ్యాన్ చేయాలి అని పెద్ద ఎత్తున ప్రజలే నిరసన తెలియచేస్తున్నారు.
దీనిపై కేంద్రం కూడా రెడీ అవుతోంది…4జీ అప్ గ్రేడ్ సేవలకు చైనా వస్తువులను వినియోగించకూడదని నిర్ణయం తీసుకుంది. ఇక చైనా యాప్ లపై కూడా ఇది ప్రభావం చూపనుంది .. చైనాతో సంబంధం ఉన్న 52 యాప్ లను నిషేధించాలని నిఘా సంస్థలు కేంద్రాన్ని కోరాయి.
TikTok, Zoom, LIKE, Helo, Mi Video call-Xiaomi, Vigo Video, Kwai, Bigo Live, Weibo, WeChat, VivaVideo- QU Video Inc, and Mi Community ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ నిషేదిస్తే చైనాకి మన దేశం నుంచి చాలా మార్కెట్ రెవెన్యూ తగ్గినట్టే.