ఎక్కడైనా ఘర్షణ వాతావరణం జరిగితే రెండు వైపులా నష్టాలు ఉంటాయి, అయితే ముందు కాలు దువ్విన వర్గం వైపు నుంచి ఈ నష్టం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి, తాజాగా భారత్ చైనా మధ్య గాల్వాన్ లో జరిగిన ఘర్షణ విషయంలో భారత్ ది ఏ తప్పు లేకపోయినా చైనా దూకుడు వల్ల ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి.
జూన్ 15 రాత్రి భారత సరిహద్దులోని గాల్వాన్ లోయలో… భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో… చైనా సైనికులు కూడా చనిపోయారన్న అంశంపై స్పష్టత వచ్చింది.చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది, అయితే మన సైనికులు 20 మంది మరణించారు కాని చైనా నుంచి ఎంత మంది చనిపోయారు అనేది తెలియలేదు.
అయితే తాజాగా గ్లోబల్ టైమ్స్ మాటల ప్రకారం అక్కడ 18 నుంచి 20 మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది, కాని మన వారు చెప్పే దాని ప్రకారం చైనా నుంచి 40 మంది కంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారని కేంద్ర మంత్రి, భారత ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కామెంట్ చేశారు..చైనా ప్రభుత్వం ఇప్పటివరకూ అధికారికంగా ఎంత మంది చనిపోయిందీ చెప్పట్లేదు.