ముంబైలో కేసులు భారీగా పెరుగుతున్న వేళ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌

ముంబైలో కేసులు భారీగా పెరుగుతున్న వేళ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌

0
105
Mumbai

దేశంలో ఎక్క‌డ చూసుకున్నా కేసులు భారీ సంఖ్య‌లో వ‌స్తున్నాయి, ఈ స‌మ‌యంలో భారీగా కేసులు రావ‌డంతో చాలా మంది ఆందోళ‌న చెందుతున్నారు… బ‌య‌ట‌కు రావ‌డానికి ఆలోచ‌న చేస్తున్నారు, అయితే ముంబైలో దారుణంగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఏకంగా ల‌క్ష కేసులు మ‌హారాష్ట్ర‌లో దాటేశాయి ఇంత దారుణంగా కేసులు పెరిగిపోయాయి.

లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయి ఆ తర్వాత ప్రభుత్వాల చొరవతో సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు మళ్లీ నగరానికి పోటెత్తుతున్నారు. ఇలా కేసులు పెరుగుతున్నా చాలా మంది వ‌ల‌స కూలీలు మ‌ళ్లీ ఆ ముంబై న‌గ‌రానికి చేరుకుంటున్నారు.

మ‌ళ్లీ వేలాది మంది ముంబై చేరుకోవ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు, దాదాపు మార్చి నుంచి ఉపాధి లేక ఇబ్బంది ప‌డ్డామ‌ని అందుకే త‌మ‌కు ఉపాధి చూపించే మ‌హాన‌గ‌రానికి చేరుకుంటున్నాము అంటున్నారు, ఇలా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు చాలా మంది వ‌స్తున్నారు. మహారాష్ట్ర నుంచి 844 రైళ్లలో 18 లక్షల మంది కార్మికులు స్వస్థలాలకు తరలిపోయారు. వారిలో ఇప్పుడు చాలా మంది తిరిగి ముంబై చేరుకుంటున్నారు, దాదాపు ఉపాధి కోసం మ‌ళ్లీ 5 ల‌క్ష‌ల మంది వచ్చారు అని తెలుస్తోంది.