ప్రధాని నరేంద్రమోదీ ఆరవ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు, ఇది పండుగల సీజన్ అని అతి జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు, అన్ లాక్ 1లో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారని ఇప్పుడు ఉండద్దు అని తెలిపారు, దాని వల్ల కేసులు మరింత పెరుగుతున్నాయి అని తెలిపారు.
ఇక సుమారు నవంబర్ వరకూ రేషన్ ఉచితంగా అందిస్తాము అన్నారు, అంతేకాకుండా సుమారు 80 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది అని తెలిపారు, అలాగే దీని కోసం కేంద్రం 90 వేల కోట్లు ఖర్చు చేస్తోంది అని తెలిపారు. వర్షాకాలం కావడంతో అతి జాగ్రతగా ఉండాలి అని తెలిపారు ప్రధాని మోదీ.
5 కేజీల బియ్యం, 1 కిలో శనగలు అందిస్తారు, మాస్క్ ధరించాలి… కచ్చితంగా బయటకు వస్తే భౌతిక దూరం పాటించాలి అని తెలిపారు. ఇక అందరూ ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది అని తెలిపారు మోదీ. వన్ నేషన్ వన్ రేషన్ వల్ల చాలా ఉపయోగం అని తెలిపారు ఆయన.