గోవాలో టూరిస్టుల‌పై మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

గోవాలో టూరిస్టుల‌పై మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

0
95

మ‌న దేశంలో చాలా మంది వీకెండ్ పార్టీ, ఎంజాయ్ మెంట్ ఏదైనా స‌ర‌దాగా స్నేహితుల‌తో టూర్ అంటే గోవా వెళ‌తారు, అక్క‌డ కొన్ని వేల హోట‌ల్స్ టూరిస్ట్ గైడ్స్ మ‌న‌కుఅందుబాటులో ఉంటారు, బీచ్ అందాలు, ఇతర సదుపాయల కారణంగా చాలా మంది గోవాకు వెళ‌తారు.

దాదాపు దేశంలో 100 రోజుల పాటు లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో పర్యాటకుల రాక నిలిచిపోయింది.
తాజాగా గోవా రాష్ట్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తమ రాష్ట్రంలో పర్యాటకులకు అనుమతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గోవా ల‌వ‌ర్స్ అక్క‌డ‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

అయితే కండిష‌న్స్ కూడా ఉన్నాయి…ఎవరైనా తమ రాష్ట్రానికి వచ్చే ముందు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని అధికారులు సూచించారు. టెస్టులు చేయించుకోకుండా వచ్చినా, గోవా వ‌చ్చే స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర టెస్టులు చేస్తారు, అప్పుడు లోప‌లికి పంపుతారు
ప్రత్యేకంగా 250 హోటళ్లను ప‌ర్యాట‌కుల‌కు సిద్ధం చేసింది. వీటికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది, వీరు పూర్తిగా అనుమ‌తులు తీసుకున్నారు, వీరు క‌రోనా రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.