బ్రేకింగ్ ప్రేమ జంట అర్థరాత్రి ఆత్మహత్య….

బ్రేకింగ్ ప్రేమ జంట అర్థరాత్రి ఆత్మహత్య....

0
60

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… తాజాగా నూతన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు… ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది… దంపతులు ఇద్దరు భార్య కన్నవారి ఇంటిలోనే ఒకే గదిలో నిద్రపోయారు… అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు లేచేసరికి ఫ్యాన్ కు ఉరి వేసుకుని గౌతమి మృతి చెందింది… భర్త శివ రైలు పట్టాలపై శవమై తేలాడు…

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ధర్మవరం పట్టణంలోని చెన్నకేశపురాకి చెందిన శివకుమార్ అనే యువకుడు మున్సిపాల్టీలో తాగునీటి విభాగంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు… ఇతను 4 నెలల క్రితం గౌతమి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.. పెళ్లి అయిన కొత్తలో భార్యభర్తలో సంతోషంగా ఉన్నా కొద్ది రోజుల నుండి భార్య భర్తల మధ్య మనస్పర్థలు వస్తుండేవి అవి కుటుంబీకులు తెలిపారు…

ఇటీవలే గౌతమి తన పట్టింటికి భర్తతో కలిసి వెళ్లింది… ఆరోజు సంతోషంగా రాత్రి భోజనం చేసి ఇద్దరు ఒకే గదిలో నిద్రపోయారు… రాత్రి 2.30 నిమిషాలకు గౌతమి గదిలో ఉన్న ఫ్యాన్ కు ఉరివేసుకుని వ్రేలాడుతున్న దృష్యాన్ని చూసి బిగ్గరగా అరిచారు… దీంతో స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను క్రిందకు దించారు… అయితే అప్పటికే గౌతమి మృతి చెందింది… ఇక ఆమె మృతి చెందటంతో శివ ధర్మవరం పుట్టపర్తి వెళ్లే రైళు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు..