చైనాకి ఒక్కో దెబ్బ పడుతోంది, గాల్వన్ ఘటన తర్వాత చైనా మార్కెట్ పై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు, భారత్ 59 యాప్స్ నిషేదించింది, ఇక పలు చైనా వస్తువులు కూడా ప్రజలు కొనడం తగ్గించేశారు.
ఇలా చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి అనే ఉద్యమం స్టార్ట్ అయింది, భారత ప్రభుత్వం కూడా పలు ప్రాజెక్టులు చైనాతో చేసుకున్న పలు కంపెనీ ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటున్నాయి, ఈ సమయంలో పలు కంపెనీలు కూడ చైనాతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాయి.
తాజాగా చైనాకు భారీ షాక్ ఇచ్చింది హీరో సైకిల్స్.. చైనాతో కుదుర్చుకున్న రూ. 900 కోట్ల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు హీరో సైకిల్స్ సంస్థ చైర్మన్ పంకజ్ ముంజల్ సంచలన ప్రకటన చేశారు.. గతంలోనే వీరు ఒప్పందం చేసుకున్నారు వచ్చే మూడు నెలలు 900 కోట్ల బిజినెస్ చేయాలని.. కాని తాజాగా దానిని రద్దు చేసుకున్నారు… కొత్త మార్కెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామని ప్రకటించారు. . భారత్‌లో 72 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది హీరో, తాజాగా తీసుకున్న నిర్ణయం పై అందరూ సూపర్ అంటున్నారు.