కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్లపై నిషేధం విధించింది, ఇందులో అన్నీటికంటే బాగా ఎక్కువ చర్చించుకునేది టిక్ టాక్ గురించే, కోట్లాది మంది యూజర్లు ఈ యాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు, ఇంకొందరు అయితే ఈ టిక్ టాక్ ఇక వద్దు అంటున్నారు.
తమకు అవకాశం ఇవ్వాలని సంబంధిత చైనా యాప్ సంస్థలు, యాజమాన్యాలు భారత్ ని కోరడంతో భారత ప్రభుత్వం వారికి 79 ప్రశ్నలు సంధించింది. దీనిపై ఆ కంపెనీ యాజమాన్యాలు ఇచ్చే సమాధానాలపై నిషేధాన్ని తొలగించాలా.. లేక కొసాగించాలా అనేది ఆధారపడి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది, అంటే వారి సమాధానాలు సరిగ్గా లేకపోయినా సెక్యూరిటీ సేఫ్టీ గురించి సరైన వివరణ ఇవ్వకపోతే ఇక యాప్స్ కనిపించవు .
జులై 22లోగా నిషేధానికి గురైన కంపెనీల యాజమాన్యాలు మా ప్రశ్నలకు స్పందించని పక్షంలో శాశ్వతంగా ఆయా చైనా యాప్స్పై నిషేధం కొనసాగుతుంది అని చెబుతున్నారు, ఇక వారు చెప్పిన సమాధానాలపై చర్చించడానిక ఓ కమిటీ వేస్తారు. దాని తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు.