క్యారెట్ తింటే కలిగే పది ఆరోగ్యకర ప్రయోజనాలు ఇవే

క్యారెట్ తింటే కలిగే పది ఆరోగ్యకర ప్రయోజనాలు ఇవే

0
84

ఎర్రగా ఉండే క్యారెట్ చూడగానే ఎవరికయినా తినాలి అనిపిస్తుంది, అంతేకాదు ఇది శరీరానికి ఎంతో మంచిది.. రంగు మేనిఛాయ కూడా పెరుగుతాయి ముఖం వచ్చస్సు బాగుంటుంది, తెలుపు రావాలి అని ముఖం మంచి రంగు రావాలి అని భావించే వారు కూడా క్యారెట్ తో ఫేస్ ఫ్యాక్ వేస్తూ ఉంటారు, ఆరోగ్యానికే కాదు సౌందర్య పోషణకు కూడా క్యారెట్ ఎంతో ముఖ్యం.

క్యారెట్ అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. చాలా మంది దీన్ని పచ్చిగానే తినేందుకు ఇష్టపడతారు. ఇక ఉడకబెట్టుకుని ఆ ముక్కుల ఆ క్యారెట్ వాటర్ కూడా తాగినా మంచిదే.. క్యారెట్ కంటికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కూడా ఎన్నో పోషకాలను అందిస్తుంది.

క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్-A కూడా అధికంగానే ఉంటుంది. బీపీ రాకుండా నివారిస్తుంది క్యారెట్, ఇక కొవ్వు సమస్య ఉంటే అది కరిగేలా చేస్తుంది, రోజు క్యారెట్ తినడం వల్ల చిగుళ్లు, పళ్లకు కూడా మంచిదని, బీపీ నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక మీరు క్యారెట్ జ్యూస్ చేసుకుంటే అందులో షుగర్ వేసుకోకుండా మిల్క్ వాటర్ వేసుకుని తాగితే స్ధూలకాయం కూడా తగ్గుతుంది, ఈ జ్యూస్ కూడా ఎంతో మంచిది.