అభిషేక్ వల్లే కుటుంబానికి వైరస్ సోకిందా? ఇంతకీ ఏం చేశారు

అభిషేక్ వల్లే కుటుంబానికి వైరస్ సోకిందా? ఇంతకీ ఏం చేశారు

0
89

ఇప్పుడు దేశం అంతా చర్చించుకునేది ఈ కరోనా గురించే… అందునా బచ్చన్ ఫ్యామిలీలో నలుగురికి వైరస్ సోకడంతో అంతా షాక్ అయ్యారు, అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా అమితాబ్ కుటుంబానికి ఎలా వైరస్ సోకింది అనేది బీ టౌన్ కి ఇంకా అర్దం కాని పరిస్దితి.

అయితే నెటిజన్లు చాలా మంది భావిస్తున్న దాని ప్రకారం బీ టౌన్ చెబుతున్న వార్తల ప్రకారం చూస్తే,
అభిషేక్ బచ్చన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ బ్రీత్ ఇన్ టు ది షాడో లో నటిస్తున్నాడు. దానికోసం అభిషేక్ కొన్ని రోజుల క్రితం డబ్బింగ్ చెప్పడం కోసం డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాడు.. ఈ సమయంలో ఆయనకి వైరస్ సోకి ఉంటుంది అని అంటున్నారు.

ఇలా కుటుంబంలో నలుగురికి వచ్చి ఉంటుంది అంటున్నారు కొందరు పెద్దలు.అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆధ్య ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లో హొమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి కి మాత్రం నెగటివ్ అని రిపోర్ట్ లు వచ్చాయి.