బ్రేకింగ్ – ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త

బ్రేకింగ్ - ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త

0
92

ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పేద‌ల‌కు అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చింది, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీలు అన్నీ నెర‌వేరుస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు కూడా నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని ఆదేశించారు. దీంతో వారికి కూడా ఈ న‌గ‌దు అంద‌నుంది.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ లబ్ది చేకూరనుంది. 8.21 లక్షల మందికిపైగా మహిళలకు ఇది అందుతుంది.

పిన్ష‌న్లు అందుకుంటున్న వారు కూడా దీనికి అర్హులే.ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక చాలా మంది జూన్ 28 నుంచి ధ‌ర‌ఖాస్తు చేసుకున్నారు, ఇలా అంద‌రికి సాయం అందించ‌నున్నారు.