మరో పెద్ద సినిమాలో కీర్తి సురేష్ కు అవకాశం

మరో పెద్ద సినిమాలో కీర్తి సురేష్ కు అవకాశం

0
35

కీర్తీ సురేష్ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది, అయితే ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి చిత్రంలో నటించడంతో ఆమెకి మంచి ఫేమ్ వచ్చింది.సౌత్లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో తన నటనకు కీర్తికి జాతీయ పురస్కారం వచ్చింది.

ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన రంగ్ దే, మహేష్ సర్కారు వారి పాటలో నటిస్తోన్న కీర్తికి తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహిస్తున్నారు, ముందు ఈచిత్రంలో అనుష్క అనుకున్నారట, కాని తాజాగా కీర్తిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా అలిమేలుమంగ వేంకటరమణపేరిట ఈ సినిమా వస్తోంది,
యాక్షన్ సినిమాల నుంచి గోపీచంద్ కాస్త ఈ సినిమాతో వెరైటీగా కనిపించాలి అని భావిస్తున్నారు.
ఫ్యామిలీ డ్రామాతో సాగనుందట ఈ చిత్రం. మొత్తానికి మూడు సినిమాల్లో కీర్తీ సురేష్ ఛాన్స్ సంపాదించుకుంది.