సీమలో వైసీపీ టీడీపీ నేతలమధ్య బిగ్ ఫైట్…

సీమలో వైసీపీ టీడీపీ నేతలమధ్య బిగ్ ఫైట్...

0
105

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీలనేతలమధ్య ఘర్షణ చోటు చేసుకుంది… ఈసంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… రాయదుర్గం పట్టణంలోని అంబేత్కర్ నగర్ కాలనీలో 19వ వార్డులో టీడీపీ వైసీపీ నేతల మధ్యస్థల ఘర్షణ చోటు చేసుకుంది..

వైసీపీ వర్గంపై టీడీపీ వర్గం దాడి చేసింది… ఈ దాడిలో వైసీపీ నాయకులుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి… అయినా కూడా పార్టీనేతలు వారిని పరామర్శించలేదు.. దీంతో వారు ఆవేదన చెందుతున్నారు… ఈ సంఘటనపై తాము పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినా కూడా వారు స్పందించకున్నారని మండిపడుతున్నారు…

కేసు నమోదు చేయకపోగా తమపై బైండోవర్ కేసు నమోదు చేశారని వైసీపీ వర్గీయులు మండిపడుతున్నారు… గతంలో తమకు ప్రభుత్వం వారు ఐదు సెంట్ల స్థలం ఇచ్చారనితమ ఇంటిస్థలం పక్కనేరస్తా ఉండేదని దాన్ని టీడీపీ నేతలే వేర్వేరు సర్వే నంబర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వాపోతున్నారు… దీన్ని అధికారులు లోతుగా విచారణ చేస్తే అక్రమాలు బయట పడతాయని అంటున్నారు…