నోరూరించే పన్నీర్ నగ్గెట్’స్ రిస్పీ ఎలా తయారుచేయాలంటే…

నోరూరించే పన్నీర్ నగ్గెట్'స్ రిస్పీ ఎలా తయారుచేయాలంటే...

0
89

పన్నీర్ నగ్గెట్’స్ పేరు వినగానే నోరూరట్లేదూ పన్నీర్ భారతీయులకి చాలా ఇష్టమైన ఆహార పదార్థం అందుకే దాదాపు ప్రతి భారతీయ వంటిట్లో కన్పిస్తుంది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువమంది పన్నీరు వాడుతుంటారు… పన్నీర్ కి సంబంధించి మంచి విషయం ఏంటంటే అది మనం ఏ వంటక పద్ధతికి జతచేసినా దానిలో ఇమిడిపోయే స్పెషాలిటీ ఇందులో ఉంది..

ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం…

పన్నీర్ -200 గ్రాములు, బ్రెడ్ ముక్కలు – 4, అల్లం – ½ చెంచా, వెల్లుల్లి – ½ చెంచా
మిరియాల పొడి – 1 ½ చెంచా,కారం – 1 చెంచా, నిమ్మకాయ – అర చెక్క, మొక్కజొన్న పిండి – ½ కప్పు, మైదాపిండి – 2 చెంచా, కొత్తిమీర – ఒక బౌల్ లో (తరిగినది), నూనె – 2 కప్పులు

ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం…

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అల్లం, వెల్లుల్లి పేస్టును దానిలో వేయండి అలాగే చెంచా ఎర్రకారం వేయండి. ఆతర్వాత అరచెంచా మిరియాల పొడి, రుచికి ఉప్పును వేయండి.ఇప్పుడు 1 కప్పు తరిగిన కొత్తిమీరను వేసి, నిమ్మరసం పిండండి.బాగా కలిపి తరిగిన పన్నీర్ ముక్కలు వేయండి. మిశ్రమం మొత్తం బాగా కలిసేట్టు 30 నిమిషాలు అలా నాననివ్వండి. ఆ తర్వాత నాలుగు బ్రెడ్ ముక్కలను తీసి మిక్సీలో క్రంబ్స్ లాగా ముక్కలు చేయండి.ఈ బ్రెడ్ క్రంబ్స్ ను వేడిచేసిన నూనె ఉన్న పెనంలో వేయండి.
3నుంచి 4 నిమిషాలు తక్కువ మంటపై ఉంచి, బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా కలపండి.ప్లేట్లోకి తీసుకుని, మాములు గది ఉష్ణోగ్రతలోనే చల్లబడనివ్వండి. ఇప్పుడు, మీడియం సైజు గిన్నె తీసుకుని అరకప్పు మొక్కజొన్న పిండిని వేయండి.
2 చెంచాల మైదాను వేసి, అరచెంచా మిరియాల పొడిని వేయండి. అలాగే చిటికెడు ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి, గడ్డలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు మెరినేటడ్ పన్నీర్ ముక్కలు తీసుకుని, ఈ మిశ్రమంలో ముంచండి. తర్వాత ఈ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ పొడిపై దొర్లించి, నూనెలో వేయండి.బంగారు బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగనివ్వండి. ఇక బంగారు రంగులోకి మారాక, నూనె నుంచి తీసేసి టమాటా కెచప్ తో వేడివేడిగా వడ్డించండి.

మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే….

పన్నీర్ వేసేముందు నూనె బాగా కాగేలా చూసుకోండి. దానివల్ల పన్నీర్ ఎక్కువ నూనె పీల్చుకోదు.