వైసీపీలో ఆ లేడీ ఎమ్మెల్యేకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

వైసీపీలో ఆ లేడీ ఎమ్మెల్యేకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

0
30

అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అరుదైన ఘనతను సాధించారు. కోవిడ్ -19 పరీక్ష, చికిత్స నిర్వహించడానికి గాను నూతన ఆవిష్కరణల‌ పోటీని జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ ఆర్ డి సి) ప్రకటించారు ఇందుకోసం దేశ వ్యాప్తంగా వేలాది అప్లికేషన్లు వచ్చాయి. వివిధ స్థాయిల్లో వడపోతల తర్వాత ప్రధానంగా 65 ఆవిష్కరణలు పోటీలో నిలబడ్డాయి. వీటిలో 16 ఆవిష్కరణలను విజేతలుగా ప్రకటించారు. ఇందులో ఒకటి పద్మావతి ఆవిష్కరించారు.

కరోనా వైరస్ కు క్షేత్రస్థాయిలో డాక్టర్లు నర్సులు ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పిపియిలు, మాస్కులు వంటి రక్షణ కవచాలు వాడుతున్నప్పటికీ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వారి నైతిక స్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సరికొత్త ఆవిష్కరణను రూపొందించారు.

ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా వైద్య సిబ్బందికి వైరస్ సోకని ఒక క్యాబిన్ ను రూపొందించారు. డాక్టర్లు లోపలికి ప్రవేశించిన తర్వాత అందులో పూర్తిగా సురక్షితమైన వాతావరణం ఉంటుంది. వైరస్ చొరబడటానికి అవకాశం లేకుండా దీన్ని రూపొందిస్తారు. దీని ద్వారా వారు రోగులకు సేవలు అందిస్తారు. వార్డులో అటూఇటూ స్వేచ్ఛగా తిరగవచ్చు.

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 తో పాటు భవిష్యత్తులో మరింత భయంకరమైన వైరస్ లు వచ్చినా ఈ ఆవిష్కరణ వైద్య సిబ్బందికి ఒక వరం కానుంది.
ఒక ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారి కావడం విశేషం. జొన్నలగడ్డ పద్మావతి అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు