హైదరాబాద్ బిర్యానీ ప్రియులకి బ్యాడ్ న్యూస్

హైదరాబాద్ బిర్యానీ ప్రియులకి బ్యాడ్ న్యూస్

0
120

హైదరాబాద్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది, ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇక కేసులు ఇలా భారీగా రావడంతో బయట ఎలాంటి ఫుడ్ దొరకడం లేదు టిఫిన్ షాపులు చాలా వరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి, ఇక పలు హోటల్స్ రెస్టారెంట్లలో జనం రావడం లేదు.

ఇక ఆన్ లైన్ లో కూడా చాలా వరకూ అమ్మకాలు లేవు, చాలా మంది ఇంటి ఫుడ్ తింటున్నారు,ఈ ఎఫెక్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానికి వచ్చింది.. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం హైదరాబాదీ బిర్యానీ హౌసెస్ ఉంటాయంటే దాని ప్రాముఖ్యత సులభంగానే అర్థమవుతుంది. అయితే హైదరాబాదీ బిర్యానీకి నగరంలో ఇలాంటి పరిస్దితి వస్తుంది అని ఎవరూ అనుకోలేదు.

చాలా వరకూ బిర్యానీ పాయింట్లు నాలుగు నెలలుగా అమ్మకాలు లేక అక్కడ వారు రెంట్ కట్టలేక షాపులు క్లోజ్ చేస్తున్నారు… బిర్యానీ హౌస్ లు దాదాపు చాలా వరకూ క్లోజ్ చేశారు, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా చాలా మంది సిబ్బందికి పనిలేదు అని చెబుతున్నారు. గతంలో నిమిషానికి 123 బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవగా ప్రస్తుతం ప్రస్తుతం నిమిషానికి 30 బిర్యానీ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి.
పెద్ద పెద్ద రెస్టారెంట్లకి కూడా నాలుగు ఐదు ఆర్డర్లు గంటకి వస్తున్నాయి, గతంలో లక్ష రూపాయలు అమ్మే బిర్యానీ హౌస్ లు ఇప్పుడు కేవలం పదివేలు ఐదువేలకు మాత్రమే తగ్గిపోయాయి.