ఈ ప్రాంతాల్లో పాములు ఎక్కువ ఉంటాయి వీటి దగ్గరకు వెళ్లకండి ఇవే ఆ ప్రాంతాలు

ఈ ప్రాంతాల్లో పాములు ఎక్కువ ఉంటాయి వీటి దగ్గరకు వెళ్లకండి ఇవే ఆ ప్రాంతాలు

0
41

మన దేశంలో పాములు చెలరేగిపోయే కాలం ఇదే, పూర్తిగా వర్షాకాలంలో పాములు దారుణంగా వస్తాయి, ఎక్కడ చూసినా తొటల్లో పొలాల్లో ఇవి కనిపిస్తాయి… ఇక గ్రామాల్లో పాముకాటుకు గురైన వారు ఆస్పత్రికి రావాలని, మూఢ నమ్మకాలను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది.

కప్పలు ఎలుకలు తినడానికి ఈ పాములు ఎక్కువ వస్తాయి, అందుకే గడ్డి వాముల దగ్గర తడి ప్రాంతాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి.. కట్టెలు కదిలించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి మధ్యలో పాములు తేళ్లు ఉండే ప్రమాదముంది. కొన్ని ప్రాంతాల్లో పిడకలు దొంతరలుగా పేర్చి పెడతారు అక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇక కట్టెల కోసం చెట్లు నరికి లైన్ గా పేరుస్తారు అవి తీసే సమయంలో జాగ్రత్త అక్కడ కింద చల్లగా పాములు ఉంటాయి.

చేల గట్ల మీద నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కర్ర చప్పుల్లతో పాములు పక్కకు పోతాయి ఈ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే గుబురు చెట్లు, పూల చెట్లు ఎక్కద్దు అక్కడ కూడా నాగుత్రాచులు ఉంటాయి, సంపంగి మల్లెలు పొదల దగ్గర పాములు ఉంటాయి జాగ్రత్త.