ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో 1500 పడక గదుల ఆసుపత్రిని నిర్మిస్తున్నారని ఏంపీ విజయసాయిరెడ్డి తెలిపారు…ఆ ఆసుపత్రి యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు… ఆమేరకు ఆయన ట్వీట్ చేశారు…
అనంతపురం జిల్లాలో 1500 పడకల కరోనా ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గూగూల్ లో వెతికి చూడండి పచ్చ తమ్ముళ్లూ. ఇంకెక్కడైనా ఇంత వేగంగా, సకల సౌకర్యాలతో తాత్కాలిక హాస్పిటల్ తయారైందేమో. ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే సిఎం ఉండటం రాష్ట్రం అదృష్టం అని అన్నారు..
బాబోయ్ .. మీ గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించే వరకూ వెళ్లిందా ? ఉత్తరాంద్ర ప్రజలు ఏం పాపం చేశారు ? మీ కుట్ర ప్రజలకు అర్ధమౌతుంది. దయచేసి టీ కప్పులో సునామీ కధనాలు మానుకోండి. ప్రజల్ని హాయిగా బ్రతకనివ్వండి. కుదిరితే అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి.