ఈ కరోనా వైరస్ వల్ల చాలా వరకూ అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు… ఇక ఉద్యోగులు అయితే అందరూ కూడా ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఈ సమయంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులు అందరికి ఇప్పటీకే దాదాపు నాలుగు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో వర్క్ ఇచ్చాయి.
జీతాలు చెల్లిస్తున్నాయి, మరి కొందరికి నెట్ పవర్ బిల్లులు ఫర్నిచర్ కు నగదు ఇస్తున్నాయి, అయితే కంపెనీలు మరి ఇప్పుడు తెరిచే ఉద్దేశ్యంలో లేదు అని తెలుస్తోంది, చాలా పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులతో కంపెనీలు వర్క్ చేయించుకుంటున్నాయి.
అది కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు….తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది. దీనిపై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది…ఇక అనేక ప్రైవేట్ కంపెనీలు సాఫ్ట్ వేర్ కంపెనీలు గూగుల్ ఫేస్ బుక్ వంటి కంపెనీలు కూడా డిసెంబర్ 31 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశం ఇచ్చాయి.