వేడినీటి కాపడం పెట్టుకుంటున్నారా ఇది తెలుసుకోండి

వేడినీటి కాపడం పెట్టుకుంటున్నారా ఇది తెలుసుకోండి

0
299

మనకి చిన్నతనం నుంచి బామ్మలు అమ్మమ్మలు తాతయ్యలు కొన్ని వైద్యాల గురించి చెబుతారు, జలుబు చేయగానే వెంటనే మనం మందులు వేసుకుంటాం, కాని వేడి వేడి పాలల్లో కాస్త పసుపు లేదా మిరియాల పొడి వేసి తాగితే గతంతో తగ్గిపోతుంది అని ఇచ్చేవారు, ఇక దగ్గు వస్తే వెంటనే లవంగాలు లేదా తులసి ఆకుల కషాయం ఇచ్చి తాగమనేవారు లేదా కరక్కయ చప్పరించమనేవారు.

ఇలా పెద్దలు చాలా వరకూ అనేక వైద్యాలు ఇంటిలోనే చెప్పేవారు ..వాము వేసుకుంటే దగ్గు తగ్గిపోయేది.
అలాంటిదే వేడినీటి కాపడం. వేడినీటితో కాపడం పెట్టుకోవడం వల్ల చాలావరకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.

మనకి ఏదైనా నొప్పి వచ్చినా దెబ్బ తగిలినా కాలు బెణికినా వేడినీటి కాపడం పెట్టుకోవడం చేస్తాం, ఇలా చేయడం మంచిదే, 104 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వేడినీళ్లు నొప్పిని అణచిపెట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు లండన్ లో నిపుణులు. చర్మంలోని గ్రాహక కణాలు నొప్పికి సంబంధించిన సమాచారాన్ని జ్ఞాననాడుల ద్వారా మెదడుకు చేరవేయడానికి కొన్ని రసాయన పదార్థాలు అవసరం అవుతాయట తాజాగా తెలియచేశారు

ఈ వేడివల్ల ఈ రసాయన పదార్థాలు నొప్పిని గుర్తించలేవు. అందుకే నొప్పికి సంబంధించిన సమాచారం మెదడుకు చేరదు అని అంటున్నారు. ఇలా మనకు నొప్పి తెలియకుండా పోతుంది. అది దీని వెనుక ఉన్న విషయం.