కరోనా విషయంలో మోడీ కీలక నిర్ణయం…

కరోనా విషయంలో మోడీ కీలక నిర్ణయం...

0
125

దేశంలో కరోనా వైరస్ దండయాత్ర కొనసాగిస్తోంది… రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఇటీవలే భారీ సడలింపులతో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో కరోనా కేసులు ఎక్కువ అయ్యాయి…

రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి… అయితే త్వరలో సడలింపులతో కొనసాగుతున్న లాక్ డౌన్ గడువు మూగీయనుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై కేంద్రం చర్చిస్తోంది…

ఇదే విషయమై ప్రధాని మోడీ ఈనెల 27న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులు అభిప్రాయాన్ని తీసుకోనున్నారు… రాష్ట్రంలోని కరోనా పరిస్థితుల గురించి అలాగే కట్టడి చర్యలు మరోసారి లాక్ డౌన్ విధింపు గురించి ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు మోదీ… ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు….