ఇటీవలే ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది…
మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఏ1 నిందితుడు రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఏ మురళీ మరో నిందితుడు సుబ్బారావులు వేసిన పిటీషన్లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది…
ఈఎస్ఐ మందులు కొనుగోలు కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఏసీబీ అధికారులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే… ఈ కుంభకోణంలో పదిమందిని అరెస్ట్ చేశారు.. ఇందులో నలుగురు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.. అయితే బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరి బెయిల్ ను కొట్టివేసింది హైకోర్టు…