బాలకృష్ణ – బోయపాటి సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ?

బాలకృష్ణ - బోయపాటి సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ?

0
86

బాలయ్య బోయపాటి సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి, వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంటున్నారు, ఇక తెరపై బాలయ్యని బోయపాటి ఎలా చూపిస్తారా అనే ఆసక్తి ఉంది.

ఇక గత సినిమాల రేంజ్ దాటేలా బోయపాటి ఈ చిత్రం టేకింగ్ ఉంటుంది అంటున్నారు, ఇక ఈ సినిమాలో ఫస్ట్ రోర్ అంటూ ఇటీవల విడుదలైన వీడియోకు మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాలో అతిథి పాత్రలో ఓ యంగ్ హీరో కనిపించబోతున్నాడట.

అయితే దీని కోసం కల్యాణ్ రామ్, నాగశౌర్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకుంటున్నారు, ఇప్పటికే ఇందులో కీలక పాత్రలో హీరోయిన్ స్నేహ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి, చూడాలి ఈ ఛాన్స్ ఎవరికి వస్తుందా అనేది? దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఏమీ ప్రటకన రాలేదు.