రఫేల్ యుద్ధ విమానాలు అంటే ఏమిటి? వీటి శక్తి సామర్ధ్యాలు

రఫేల్ యుద్ధ విమానాలు అంటే ఏమిటి? వీటి శక్తి సామర్ధ్యాలు

0
30

రఫేల్ యుద్ధ విమానాలు మొత్తానికి మన దేశానికి వచ్చేశాయి….ఫైనల్ గా అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి.ఫ్రాన్స్ నుంచి మన దేశానికి వచ్చాయి. దీనికి సంబంధించి 2016 లోనే ఒప్పందం కుదిరింది.దాదాపుగా రూ.58000 కోట్ల రూపాయలతో 26 యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నారు.

దాదాపు ఈ యుద్ద విమానం ఒక్కొక్కటి రూ.1611 కోట్లు, ఇక వీటి సామర్ధ్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్దవిమానాలుగా చెబుతారు, వీటి నుంచి అత్యాధునిక ఆయుదాలు ప్రయోగించవచ్చు
9500 కేజీల బరువైన ఆయుధాలను ఈ విమానాలు మోసుకెళ్లగలవు.

వీటి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు, ఇక వీటి నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ వరకూ క్షిపణులు వదలచ్చు.. గాలిలో నుంచి గాల్లోకి, గాలిలోనుంచి భూమిమీదకు ఈ విమానాల ద్వారా క్షిపణులను ప్రయోగించవచ్చు. దీని స్పీడ్ చాలా ఎక్కువ గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇక ఈ యుద్దవిమానాలు కూడా అన్నీ దేశాలు కొనుగోలు చేయవు చాలా రేర్ గా ఫ్రాన్స్ ఇస్తుంది.