వైయస్ వివేకానందరెడ్డి మరణ వార్త వైయస్ కుటుంబంలో విషాదం నింపింది అని చెప్పాలి…రాత్రి ప్రచారం నుంచి వచ్చిన ఆయన తెల్లవారుజామున వాంతులు మొదలుకావడంతో బాత్రూమ్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు.అయితే ఆయనది సహజ మరణమా, లేదా ఆయనది హత్యా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఆయన పీఏ రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు అందచేశారు.
మరి ఆయన మరణంపై లేవనెత్తుతున్న అనుమానాలు ఇప్పుడు చూద్దాం.
1..నుదిటిన గాయం
2..తల వెనుక గాయం
3..అర చేతికి గాయం
4..బెడ్ రూమ్ లో రక్తం
5..బాత్రూమ్ లో రక్తం
6…వివేకాకు గుండెపోటు వచ్చిందా ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడం ఏమిటి ఎందుకు
7…బెడ్ పై నుంచి లేచి వచ్చే సమయంలో కింద పడిపోయారా లేదా ఆయన బాత్రూంలోకి వెళ్లిన సమయంలో హార్ట్ అటాక్ వచ్చి కిందపడ్డారా
8…కిందపడిన తర్వాత తలకి గాయం అయి రెండు లీటర్ల రక్తం కారిందా
9…ఆయన బెడ్ రూమ్ లో పడిపోయారా లేదా అక్కడ నుంచి బాత్రూంకి వెళ్లారా అనేది అనుమానం
10…బెడ్ రూమ్ డోర్ ఎవరు తెరిచారు
11..వాచ్ మెన్ ఉన్న ఆయన ఎందుకు పిలవలేదు,
12..అరచేతికి గాయం ఎలా అయింది, దెబ్బ తలకి కిందపడి తగుతుంది ఈ సమయంలో అరచేతికి గాయం ఎలా అవుతుంది
13..ఇక ప్రధాన అనుమానం ఆయన బెడ్ రూమ్ లో పడిపోయారా లేదా బాత్రూంలో పడిపోయారా …బాత్రూమ్ లో పడిపోతే, బెడ్ రూమ్ లో రక్తపు మరకలు ఎలా ఉన్నాయి. ఇవన్నీ ఆయన కుటంబంలో వారికి అక్కడ ప్రజలకు అనుమానాలుగా ఉన్నాయి.