అమ్మాయిని పెళ్లిచేసుకుంటానంటున్న శృతిహాసన్ ఇదేం వింత

అమ్మాయిని పెళ్లిచేసుకుంటానంటున్న శృతిహాసన్ ఇదేం వింత

0
89

కొందరికి కొన్ని వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి ..ముఖ్యంగా పెళ్లి విషయంలో ఒక్కొక్కరు ఎలాంటి వారిని సెలక్ట్ చేసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతాం.. నిజమే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఆశ్చర్యం కలిగించేవి.. హీరోయిన్ల విషయంలో కూడా జరుగుతున్నాయి. అబ్బాయి అబ్బాయి, అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు ఒక్కోచోట అందరిని షాక్ కు గురిచేస్తోంది ..మరి హీరోయిన్లు కూడా ఇలా తయారు అవుతున్నారా అంటే , తాజాగా శృతిహసన్ చేసిన కామెంట్ కాస్త ఆలోచన రేకెత్తించింది. మరి ఈ ముద్దుగుమ్మ చెప్పింది ఏమిటి కొందరు అనుకున్నది ఏమిటి అనేది టేక్ ఏ లుక్.

నాకు అవకాశం వస్తే తమన్నాను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు కమల్ హాసన్ గారాల తనయ శృతి హాసన్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో శృతి తమన్నా మంచి సన్నిహితులు ఎక్కడికి అయినా ఫంక్షన్లకు కలిసి వెళతారు అనేది తెలిసిందే ఇద్దరూ అవకాశం వస్తే ఒకరిని ఒకరు ప్రశంసించుకున్న సందర్బాలు ఉన్నాయి..ఓ చిట్చాట్ కార్యక్రమానికి హాజరైన శృతి హాసన్ వెళ్లారు, ఈ సమయంలో హోస్ట్ ప్రశ్న అడిగారు..ఒక వేళ మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్తో డేట్కు వెళ్తారని ప్రశ్నించారు.అందుకు శృతి.. తమన్నా. తనంటే నాకు చాలా ఇష్టం. ఒక వేళ నేనే గనక అబ్బాయినైతే.. కచ్చితంగా తమన్నానే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది శృతి.. దీంతో అందరూ షాక్ అయ్యారు. వామ్మో శృతికోరిక భలే గమ్మత్తుగా ఉంది అని చెబుతున్నారు. అయితే ఇది సరదాకి మాత్రమే అని కొందరు అభిమానులు అంటున్నారు.