మునగాకు రసం ఆకుతో ఉపయోగాలు తెలుసా

మునగాకు రసం ఆకుతో ఉపయోగాలు తెలుసా

0
120

వర్షాకాలం శ్రావణం సమయంలో మునగ ఆకు కచ్చితంగా తినాలి అని పెద్దలు చెబుతారు, ఈ సమయంలో వచ్చే అనేక వ్యాధులు తగ్గుతాయి అని ఈ మాట చెబుతారు, మునగ ఆకు చాలా మంచిది ఆరోగ్యానికి, దీనిని పప్పుగా చేస్తారు.

అయితే గుప్పెడు మునగ ఆకులు వేసి మరిగించాలి, తర్వాత దానిని చల్లార్చి మునగాకు తీసి రసం పోయాలి, అందులో మిరియాలు పొడి ఉప్పు వేసి తీసుకుంటే అజీర్తి సమస్యలు ఉండవు జలుబు ఉన్నా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు

ఇక మునగ ఆకు కషాయం ఇది కూడా పిల్లలకు చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటారు…వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది. ఇది తీసుకుంటే మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్రపిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుంది. ఈ రసం మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచిదే.