వీరు జాగ్ర‌త్త క‌రోనా సోకే ప్ర‌మాదం వీరికి ఎక్కువ ?

వీరు జాగ్ర‌త్త క‌రోనా సోకే ప్ర‌మాదం వీరికి ఎక్కువ ?

0
96

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రిని విడిచి పెట్డడం లేదు, సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల వ‌ర‌కూ అంద‌రిని ఇది క‌ల‌వ‌ర‌పెడుతోంది, అయితే ఈ క‌రోనా వైర‌స్ సోకిన త‌ర్వాత కొంద‌రిలో వెంట‌నే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి మ‌రికొంద‌రికి అస‌లు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు,

అయితే క‌రోనా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఎవ‌రికి ఎక్కువ‌గా ఉంది అంటే మాస్క్ ధ‌రించ‌ని వారు, అలాగే రోడ్ల‌పై భౌతిక దూరం పాటించ‌ని వారికి ఉంది, ఇక ఊబకాయం ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు చెప్తున్నారు.

ఇక శ‌రీరంలో గ‌తం నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి కూడా సోకే ప్ర‌మాదం ఉంది. వీరిలో కొవ్వు కూడా అధికంగా ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్య ఆస్మా స‌మ‌స్య ఉన్న వారికి కూడా సోకే ప్ర‌మాదం ఉంది, వీలైనంత వ‌ర‌కూ బ‌రువు త‌గ్గాలి, అలాగే జంక్ ఆయిల్ ఫుడ్ త‌గ్గించాలి అని చెబుతున్నారు వైద్యులు.