కొర‌టాల మూవీలో స్టైలిష్ స్టార్ ఎలా క‌నిపిస్తారంటే ?

కొర‌టాల మూవీలో స్టైలిష్ స్టార్ ఎలా క‌నిపిస్తారంటే ?

0
140

అల వైకుంఠ‌పురం చిత్రం త‌ర్వాత పుష్ప చిత్రం చేస్తున్నారు బ‌న్నీ, అయితే దాదాపు నాలుగు నెల‌లుగా చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌డం లేదు, బ్రేక్ ఇచ్చింది చిత్ర యూనిట్, అయితే ఈ స‌మ‌యంలో ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర క‌థ‌లు వింటున్నారు బ‌న్నీ, తాజాగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ చెప్పిన క‌ధ న‌చ్చ‌డంతో ఆయ‌న సినిమాని ఒకే చేశారు.

చిత్రం ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.. .కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్ పాత్ర గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ 21 మూవీకి సంబంధించి సముద్రతీరంలో వున్న ఫోటో వైరల్ అవుతోంది. బన్నీ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడట.

ఇందులో బ‌న్నీ పొలిటిక‌ల్ స్టార్ గా క‌నిపిస్తారు అని వార్త‌లు వ‌చ్చాయి, ఆయ‌న విద్యా వ్య‌వ‌స్ద విద్యార్దుల క‌ష్టాల గురించి పోరాటం చేసే స్టూడెంట్ లీడ‌ర్ గా క‌నిపించ‌నున్నార‌ట‌.యువతను రాజకీయాల్లోకి రమ్మని చెప్పే యువకుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మిగిలిన క్రూ ని మ‌రికొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తారు, ఇటు కొర‌టాల చిరుతో ఆచార్య ఫినిష్ చేసి ఈ సినిమా సెట్స్ పై పెట్ట‌నున్నారు.