టాలీవుడ్ లో అందాల తార కాజల్ కు ఏ మాత్రం ఇమేజ్ తగ్గలేదు, ఆమెకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి, స్టార్ హీరోలు సైతం కాజల్ నే సినిమాలకు అడుగుతున్నారు, అయితే ఆమె సెలక్ట్ చేసుకుని కొన్ని సినిమాలు మాత్రమే చేస్తోంది.
అయితే రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటోందట ఈ భామ…రానా కథానాయకుడుగా హిందీలో రూపొందుతున్న హాథీ మేరీ సాథీ చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇందులో కాజల్ 30 నిమిషాలు ఉంటుంది, అయితే మంచి సినిమా అలాగే తన పాత్ర డిమాండ్ బట్టీ.
ఇందులో నటించినందుకు ఆమె 70 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి.. ఆమె ఆదివాసీ యువతిగా కనిపిస్తుందట.. వాళ్ల సంప్రదాయాల ప్రకారం బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే కాజల్ కనిపిస్తుందట. మొత్తానికి దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ ఫాలో కావడంతో తప్పు లేదు అంటున్నారు సినిమా అభిమానులు.